![]() |
![]() |
.webp)
అంబటి అర్జున్ బుల్లితెర మీద సీరియల్స్ లో నటిస్తూ అందరినీ అలరిస్తూ ఉంటాడు. అలాంటి అర్జున్ ఇంటికి త్వరలో ఒక బేబీ రాబోతోంది. ప్రస్తుతం అంబటి అర్జున్ వైఫ్ సురేఖ ప్రెగ్నెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ లో ఫ్యామిలీ వీక్‌లో భాగంగా అర్జున్‌ను చూడడం కోసం బిగ్ బాస్ మేకర్స్ హౌస్ లోకి సురేఖని పంపించారు అలాగే అక్కడే సురేఖ సీమంతాన్నిచేశారు. లేడీ హౌస్‌మెట్స్ అందరూ సురేఖకి చీర, పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చి అక్షింతలు వేసి దీవించారు. ఇప్పుడు అర్జున్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి వచ్చాడు . రాగానే శ్రీముఖి అర్జున్ కి ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ ఇచ్చింది. అది ఓపెన్ చేసిన అర్జున్ కి అందులో పిల్లలు ఆడుకునే బొమ్మలు కనిపించాయి.
"అబ్బాయి పుడితే ఈ పేరని, అమ్మాయి పుడితే ఈ పేరు అని అనుకుంటారు కదా మీరు ఏమైనా అనుకున్నారా" అని శ్రీముఖి అడిగేసరికి " ఆర్కా అని పేరుపెట్టాలని అనుకున్నాం. అర్జున్ లో ఏఆర్, సురేఖలో కేహెచ్ఏ కలిపి పెట్టుకుంటాం." అని చెప్పాడు. బాబు విషయం వచ్చేసరికి బాగా ఎమోషనల్ అవుతావు ఎందుకు అనేసరికి "ప్రెగ్నన్సీ టైంలో పేరెంట్స్ లేకపోయినా హజ్బెండ్ అనే అతను దగ్గర ఉండాలి అనుకుంటాడు. ఫస్ట్ ప్రెగ్నన్సీలో పక్కన లేను ..సో అది నాకు ఒక వన్ వీక్ బాధ అనిపించింది" అని చెప్పాడు అర్జున్. తర్వాత శోభా శెట్టితో పాటు ఆమె లవర్ యశ్వంత్ స్టేజి మీదకు వచ్చి రెడ్ రోజ్ ఇచ్చి ఫింగర్ రింగ్ పెట్టి "నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు" అది విని శోభా కూడా షాకయ్యింది. "ఇతన్ని ఒప్పుకోవడానికి కారణం ఏమిటి" అని శ్రీముఖి అడిగేసరికి "బాగా కేరింగ్ గా చూసుకుంటాడు. అలాగే అతని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చెక్ చేసాను. అమ్మాయిల్ని కూడా ఎక్కువగా ఎవరినీ ఫాలో అవ్వడు..." అని శోభా ఆన్సర్ ఇచ్చేసరికి "బ్రో నీ ఫ్యూచర్ అర్ధమవుతోంది" అంటూ మానస్ కౌంటర్ ఇచ్చాడు.
![]() |
![]() |